ఈ మధ్యకాలంలో లైగింక దాడులు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఆరేళ్ల బాలికపై మైనర్ బాలుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆదివారం తల్లాడ మండలంలో చోటు చేసుకుంది. తల్లాడ మండలం వెంకటరాముని తండా గ్రామానికి చెందిన మైనర్ బాలుడు అదే గ్రామానికి చెందిన ఆరు సంవత్సరాల బాలికపై ఎవరూ లేని సమయంలో లైంగిక దాడి చేశాడు. అయితే బాలిక అన్నయ్య చూసి తల్లికి చెప్పడంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లి అక్కడకు చేరుకుంది. ఇది గమినించిన నిందితుడు పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న తల్లాడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.