Renu Agarwal Murder: హైదరాబాద్ కూకట్పల్లిలో వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ (45)ను హత్య చేసిన ఘటన నగరాన్ని కలకలానికి గురిచేసింది. గురువారం సాయంత్రం బయటపడిన ఈ ఘటనపై డీసీపీ బాలానగర్ వివరాల ప్రకారం జార్ఖండ్‌కు చెందిన హర్ష, అతని స్నేహితుడు రోషన్‌లపై అనుమానం వ్యక్తమవుతోంది. ఘటన రోజు రేణు ఇంట్లో ఒంటరిగా ఉండగా హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఉదయం భర్త, కుమారుడు షాపుకు వెళ్లి, సాయంత్రం రేణు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం రావడంతో రాత్రి ఇంటికి వచ్చిన భర్త, వెనక తలుపు తెరిపించి లోపలికి వెళ్లగా రేణు హాల్‌లో చేతులు, కాళ్లు కట్టబడి హత్యకు గురైన స్థితిలో కనిపించింది. కత్తులు, చాకులతో దాడి చేసి, గొంతు కోసి, తలపై రైస్ కుక్కర్‌తో కూడా కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
నెల క్రితం హర్షను సహాయకుడిగా జార్ఖండ్ నుంచి తీసుకువచ్చారని, అతడు రోషన్‌తో స్నేహం పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన రోజు సాయంత్రం ఇద్దరూ బ్యాగ్‌తో బైక్‌పై వెళ్లిపోయినట్లు ఆధారాలు లభించాయి. ఇంట్లో విలువైన వస్తువులు మిస్సయ్యాయా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు కుటుంబ సభ్యులను ఇంట్లోకి అనుమతించకుండా ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హర్ష, రోషన్‌ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Internal Links:
సరూర్ నగర్ భర్త హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
External Links:
ఇంట్లో ఒంటరిగా ఉన్న రేణు అగర్వాల్.. వెళ్లి చూస్తే షాక్