ఆంధ్రప్రదేశ్ రాష్టం కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లె రిజర్వాయర్ లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరు చేపల వేట కోసం అని ఇంట్లో చెప్పి వెళ్లిన ముగ్గురు నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు. సాయంత్రం అయినా వీరు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రిజర్వాయర్ వద్ద గాలింపు చర్యలు చేపట్టగా అక్కడ యువకులకు సంబంధించిన దుస్తులు, చెప్పులు తదితర వస్తువులు ఉండటంతో పోలీసులకు పిర్యాదు చేశారు.
పిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చెప్పట్టారు. ఆ ముగ్గురి వ్యక్తులను ప్రొద్దుటూరుకు చెందిన వారిగా గుర్తించారు. వీరు విహార యాత్రకు అని వచ్చారని, అయితే చేపలవేట చేద్దామని రిజర్వాయర్ లోకి దిగిన వెంటనే కొట్టుకుపోయారని చెబుతున్నారు. పోలీసులు రిజర్వాయర్ వద్దకు చేరుకుని ముగ్గురి యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.