Robbery in Karnataka: కర్ణాటకలో విజయపుర జిల్లా చడ్చనా పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దుండగులు దోపిడీ చేశారు. సైనిక దుస్తులలో ఉన్న దొంగలు మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు బ్యాంకులోకి ప్రవేశించి, తుపాకులతో సిబ్బందిని బెదిరించి 50 కిలోల బంగారం, రూ.8 కోట్ల నగదును దోచుకెళ్లారు. వారు సిబ్బందిని తాళ్లతో కట్టివేసి స్ట్రాంగ్ రూమ్ వివరాలను తెలుసుకొని పరారయ్యారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీ, డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురి కంటే ఎక్కువ మంది దోపిడీలో పాల్గొన్నారని, పక్కా ప్రణాళికతోనే ఇది జరిగినట్లు భావిస్తున్నారు. దోపిడీ అనంతరం దుండగులు మహారాష్ట్ర వైపుకు పారిపోయారని ఎస్పీ పేర్కొన్నారు. నాలుగు నెలల క్రితం ఇదే జిల్లాలో కెనరా బ్యాంకులో 58 కిలోల బంగారం, రూ.5.2 లక్షల నగదును దోచిన ఘటనా మరువలేనిది, ఇప్పటి దోపిడీతో స్థానికంగా ఆందోళన పెరిగింది.
Internal Links:
అస్సాం టాప్ ఆఫీసర్ నుంచి రూ.2 కోట్ల నగదు, బంగారం స్వాధీనం.
మహానటి.. భర్తను పులి చంపిందని భలే నాటకం…
External Links:
కర్ణాటకలో సినిమా తరహా దోపిడీ.. బ్యాంకు సిబ్బందిని కట్టేసి 50 కిలోల బంగారం లూటీ