Sahasra Murder Case: కూకట్‌పల్లి చిన్నారి సహస్ర హత్య కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పదేళ్ల బాలికను 27 కత్తిపోట్లతో చంపిన బాలుడు, ఆ వెంటనే తన పెంపుడు కుందేలుపై ప్రేమ చూపించడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. బ్యాట్ దొంగతనం చేస్తూ పట్టుబడిన అతను, సహస్రను కత్తితో పొడిచి హత్య చేసి, రక్తపు మరకలు దాచుకునేందుకు బట్టలు మార్చుకున్నాడు. తర్వాత అనారోగ్యంతో ఉన్న తన కుందేలును ఆసుపత్రికి తీసుకెళ్లాడు, కానీ అది కూడా అదే రోజు చనిపోయింది. విచారణలోనూ అతను ప్రశాంతంగా ప్రవర్తించడంతో అధికారులు విస్మయపడ్డారు.
పోలీసులు బాలుడి నేపథ్యంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, తల్లి ఒక్కరే జీవనోపాధి పొందుతున్నారని తెలిసింది. అలాంటప్పుడు కుందేలు పెంపకం, స్మార్ట్‌ఫోన్ కొనుగోలు వెనుక డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేది ప్రశ్నగా మారింది. స్కూల్‌లో బాడీ షేమింగ్ కారణంగా ఒంటరిగా ఉంటూ, ఎక్కువగా యూట్యూబ్‌లో క్రైమ్ వెబ్‌సిరీస్‌లు చూశాడని గుర్తించారు. దీనిపై మరింత సమాచారం కోసం కోర్టు అనుమతితో అతడిని కస్టడీకి తీసుకుని విచారించాలని, అలాగే అతని మానసిక స్థితిని అంచనా వేయాలని పోలీసులు భావిస్తున్నారు.
Internal Links:
సగం ధరకే బంగారం అంటూ భారీ మోసం..
ఖజానా జ్యువెలరీలో దోపిడీ దొంగల బీభత్సం..
External Links:
సహస్ర హత్యకేసు: బాలికను క్రూరంగా చంపి.. కుందేలుకు ఆరోగ్యం బాగాలేదని విలవిల్లాడిపోయాడు!