ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లకు బాగా అడిక్ట్ అయిపోయారు. ఇక ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే, నిద్ర లేవగానే ఫోను పట్టుకొని యూట్యూబ్ లో షార్ట్స్, వీడియోస్ చూడడం, లేదా ఎప్పుడూ కూడా గేమ్స్ ఆడడం లాంటివి చేస్తూనే ఉంటున్నారు. ఇలా మొబైల్ కు బానిసైన చాలామంది పిల్లలు అనారోగ్యపాలై చివరికి ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.
తాజగా సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడ్తుంది. ఈ వీడియోలో ఒక బాలుడు మొబైల్ ఫోన్ చూస్తుండగా తల్లి వచ్చి ఆ పిల్ల వాడిని మందలించి మొబైల్ లాక్కొని చదవాలి అంటూ తెలిపింది. అనంతరం బుక్ తీసి చదవడం మొదలు పెట్టిన తరువాత పిల్లవాడు ఎందుకో పక్కకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో బ్యాటు తీసుకుని ఒక్కసారిగా తల్లి తలపై కొట్టాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.