చెన్నై లో ఇంజనీరింగ్ చదువుతున్న, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు శనివారం రాత్రి తమ కారులో తిరువళ్లూరు వెళ్లారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుగురు స్నేహితులు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఏపీలోని వేర్వేరు జిల్లాలకు చెందిన వీరంతా శనివారం రాత్రి విహారయాత్రకు వెళ్లారు. శనివారం తిరువళ్లూరు అరుణాచల ఆలయానికి బయలుదేరారు. రెండు రోజులు వేర్వేరు నగరాల్లో గడిపిన వారంతా ఆదివారం రాత్రి తిరిగి హాస్టల్‌కు వస్తున్నారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
లారీ ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ప్రొద్దుటూరుకు చెందిన నితీష్, తిరుపతికి చెందిన యుగేష్ (23), చేతన్ (22), కర్నూలుకు చెందిన రామోహ్మన్ (21), విజయవాడకు చెందిన బన్ను నితీష్ (22) అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు జిల్లాకు చెందిన విష్ణు, ప్రకాశం జిల్లాకు చెందిన చైతన్యలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించారు. వారిని తిరువళ్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు అతి కష్టం మీద బయటకు తీశారు.