News5am, Telugu Breaking News (14-06-2025): తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీసులు అక్రమ గంజాయి నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న ఒరిస్సాకు చెందిన భార్యాభర్తలు రఘువీర్ రాయ్, ప్రశాంతి రాయ్‌ను పట్టుకున్నారు. వీరితో పాటు గంజాయి రవాణాలో సహకరించిన సురేష్ చంద్ర కులదీప్ (ఒరిస్సా) మరియు చందన్ మండల్ (చింతూరు, ఏఎస్‌ఆర్ జిల్లా) అనే ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ నలుగురు కొండగుంటూరు కొండాలమ్మ గుడి సమీపంలోని ప్రైవేట్ లే అవుట్‌లో ఉన్న రేకుల షెడ్‌లో గంజాయిని దాచి ఉండగా పట్టుకున్నారు.
కారులో 11 ప్యాకెట్లుగా 23.101 కేజీల గంజాయి రవాణా చేస్తున్న సమయంలో దాడి చేసి పట్టుకున్నట్టు రాజమండ్రి నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్ తెలిపారు. పోలీసులు ఒక వ్యాన్, కారు, రెండు మోటార్ సైకిళ్లు, రేకుల షెడ్‌ను సీజ్ చేశారు. నిందితులు ఈ అక్రమ రవాణా ద్వారా సంపాదించిన డబ్బుతో కొంతమూరులో ఇల్లు కొనుగోలు చేసి నివాసం ఉంటున్నట్టు గుర్తించారు. పోలీసులు ఆ ఇంటిని కూడా సీజ్ చేయడానికి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
More Telugu News:
Breaking News:
ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్భన్ బ్యాంకులో ఘరానా మోసం
More Telugu Breaking News: External Sources
గంజాయి రవాణా చేస్తున్న భార్యాభర్తలు..