హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు నైజీరియన్ జాతీయులను, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల అమ్మకాల ద్వారా వచ్చే డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డబ్బును ఫారెక్స్ సేవలు, నగదు బదిలీల ద్వారా దేశం నుంచి తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు నైజీరియన్లు హైదరాబాద్‌లో తమ నివాసాన్ని కోల్పోయి డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని నార్కోటిక్స్ బ్యూరో సమాచారం అందించింది. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
కొరియర్ ద్వారా మాదకద్రవ్యాలను రవాణ చేసి తీసుకువస్తున్నారు. గోవా నుంచి వాటిని హైదరాబాద్‌కు చేరుస్తూ అవసరమైన వారికి విక్రయిస్తున్నారు. టీన్యాబ్ పోలీసులు ఎస్‌ఆర్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద పట్టుకోవడంతో మాదకద్రవ్యాల బండారం బయటపడింది. ఇలాగే చాలా మంది నైజీరియన్స్ డ్రగ్స్ మాఫీయాలో మునిగి తేలుతున్నారు.