తాజాగా తిరుపతిలో దారుణ హత్యలు జరిగాయి. అన్నపై కోపంతో అన్న పిల్లలను దారుణంగా చంపేశాడు. ఇష్టంలేని పెళ్లి కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. వదినతో పాటు వారి ఇద్దరు కూతుళ్లను కూడా కత్తితో నరికి చంపాడు. ఆపై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరిపి దాస్ తమ్ముడు గుడిమెట్ల మోహన్ (36) చెన్నైలో పనిచేస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మోహన్‌కి, అన్నవదినలు 2019లో పెళ్లి చేశారు. కూతురు పుట్టాక భార్యతో గొడవ పడి 2021లో భార్య పుట్టింటికి వెళ్లింది. తనికి (మోహన్) ఇష్టం లేని పెళ్ళి చేసినందుకు ఏవరు లేని సమయంలో ఇంట్లో ఉన్న వదినని, వదిన పిల్లల్ని హత్య చేసి ఆత్మహత్య కి పాల్ప డాడు. ఈ ఘటనపై తిరుపతి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.