విశాఖపట్నంలో అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఢిల్లీలో కూడా చిన్నారులను విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి 17 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆరుగురు చిన్నారులను రక్షించారు. విశాఖపట్నంలోని పాండు రంగపు రంలోని హార్బర్ పార్క్ సమీపంలో ఐదు నెలల పసికందును విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఆగస్టు 11న అమ్మకానికి సిద్ధంగా ఉంచిన శిశువుతో పాటు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ముఠాలకు రాష్ట్రవ్యాప్తంగా మూలాలు ఉన్నాయి. వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఆయా రాష్ట్రాలకు పంపినట్లు సీపీ తెలిపారు. త్వరలో మరికొంత మంది పిల్లలను పట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు దొరికిన నిందితులను విచారిస్తే మరికొంత సమాచారం లభించే అవకాశం ఉంది.