Wife Killed Husband

Wife Killed Husband: ఇటీవలి కాలంలో భార్యలు భర్తలను చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. విభేదాలు, వివాహేతర సంబంధాలు ఇలా పలు కారణాలతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలో ఓ భార్య తన భర్తను చంపి, పులి దాడి చేసిందని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే అందుకు కారణం వివాహేతర సంబంధం కాదు, పరిహారం. అడవి జంతువు చంపితే పరిహారం వస్తుందని భావించి ఆమె ఇలా నాటకం చేసింది.

కర్ణాటకలోని హున్సూర్ తాలూకా చిక్కహెజ్జూర్‌లో ఈ ఘటన జరిగింది. భార్య సల్లపురి తన భర్త వెంకటస్వామి (45)కి విషం ఇచ్చి హత్య చేసింది. ఆ తర్వాత అతన్ని పులి చంపిందని చెబుతూ అందరినీ తప్పుదారి పట్టించింది. నిజానికి గ్రామంలో ఒక పులి కనిపించిన సందర్భాన్ని వాడుకొని తన భర్త కనిపించట్లేదని, ఆ పులే చంపేసిందని నటించింది. కానీ పోలీసులు, అటవీ సిబ్బంది దర్యాప్తులో ఎటువంటి జంతువు ఆనవాళ్లు దొరకలేదు. అనుమానం వచ్చిన పోలీసులు ఇంటిని తనిఖీ చేస్తే, ఇంటి వెనుక గుంటలో వెంకటస్వామి మృతదేహం లభించింది. చివరికి విచారణలో భార్య సల్లపురి ఒప్పుకుని, పరిహారం కోసం ఈ పని చేశానని తెలిపింది.

Internal Links:

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య

ఎర్రకోటలో భారీ చోరీ…

External Links:

మహానటి.. భర్తను పులి చంపిందని భలే నాటకం! అసలు మ్యాటర్‌ తెలిస్తే.. షాక్‌ అవుతారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *