Woman Kills Parents: వికారాబాద్ జిల్లా బంటారం మండలం యాచారం గ్రామంలో హృదయ విదారక ఘటన జరిగింది. ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదన్న కోపంతో కన్న కూతురే తన తల్లిదండ్రులను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన నక్కల సురేఖ అనే యువతి, కుటుంబ సభ్యులు తన ప్రేమ పెళ్లిని అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులకు అనస్థీషియా ఇంజెక్షన్‌ను అధిక మోతాదులో ఇచ్చి ప్రాణాలు తీసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు నక్కల సురేఖను అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యలకు కారణమని నిర్ధారించిన పోలీసులు, కేసును అన్ని కోణాల్లో విచారిస్తూ నిందితురాలిని కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య