పల్నాడు జిల్లా, వినుకొండ చెక్‌పోస్టు సెంటర్‌లో దారుణ ఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే రషీద్ అనే యువకుడిపై షేక్ జిలానీ అనే వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనలో రషీద్ రెండు చేతులను నరికేశారు. దీంతో చాల రక్తం పోయి మృతి చెందాడు.
ఈ ఘటన జరిగిన ప్రాంతమంతా భయానకంగా మారింది. మృతుడు రషీద్ మద్యం షాపులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడు జిలానీని పట్టుకొని పోలీస్ స్టేషనకు తీసుకువెళ్ళారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తీవ్రంగా గాయపడిన రషీద్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాత గొడవల కారణంగానే జిలానీ రషీద్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది. షేక్ రషీద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు కాగా, నిందితుండు జిలానీ తెలుగుదేశం పార్టీ సభ్యుడు. రెండు పార్టీల మధ్య జరిగిన గొడవ వల్ల పలువురికి దెబ్బలు తగిలాయి. ఇంకొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.