గంజాయి మత్తులో తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్, సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతుపై మరో కేసు నమోదైంది. తండ్రీకుమార్తెల బంధంపై చీప్ కామెంట్స్ చేసిన ప్రణీత్‌ను సైబర్‌ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడిపై పోలీసులు డ్రగ్స్‌ కేసు నమోదు చేశారు. మాదకద్రవ్యాలు, గంజాయి సేవించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రణీత్ హనుమంతుపై సెక్షన్ 67బి, ఐటీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, 79, 294 బీఎన్‌ఎస్‌ మరియు ఎన్డీపీఎస్‌ చట్టాల క్రింద అనేక సెక్షన్లు జోడించబడ్డాయి. ప్రస్తుతం ప్రణీత్ చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ప్రణీత్ లాయర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది.

డార్క్ కామెడీ పేరుతో సోషల్ మీడియాలో పిచ్చిగా కామెంట్స్ చేసిన ప్రణీత్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హద్దు దాటినందుకు క్షమాపణలు చెబుతూ వీడియో వదిలాడు. గత కొన్ని రోజులుగా తన తల్లిదండ్రులను చాలా మంది వేధిస్తున్నారని, వారిని సంతోషపెట్టాలని, అదంతా తన తప్పేనని ప్రణీత్ పేర్కొన్నాడు. చట్టాన్ని గౌరవించి ముందుకు సాగుతామని, ఇకపై ఇలాంటి తప్పులు చేయబోమన్నారు. అయినా సరే అతడికి శిక్ష పడాల్సిందేనని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు గంజాయి కేసు కూడా బయటకు రావడంతో కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *