మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురువారం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని దుండగులు హత్య చేశారు. బాధితుడు దొర స్వామి (62) కురవవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తూ తన కుమార్తెతో నివసిస్తున్నాడు. దుండగులు అతని తలపై తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ వలీబ్బసు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
