హైదరాబాద్: మైనర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో మెకానిక్కు ఎల్బీనగర్ లోని ప్రత్యేక కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో విచారణ త్వరగా జరిగి నిందితుడికి లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టం కింద శిక్షను ఖరారు చేసింది. హయత్‌నగర్‌కు చెందిన నిందితుడు ఇంద్రకంటి వంశీ కృష్ణపై బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో హయత్‌నగర్ పోలీసులు 2017 క్రైమ్ నంబర్ 880లో అరెస్టు చేశారు. యావజ్జీవ శిక్షతో పాటు రూ.21 వేల జరిమానా, బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని రాచకొండ పోలీసు పీఆర్వో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.