తిరుపతి: చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం లక్ష్మయ్య కండ్రిగ బస్టాప్ వద్ద మంగళవారం తొమ్మిదేళ్ల కుమార్తె కళ్ల ముందే భార్యను కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపాల మండలం పెయనపల్లికి చెందిన ఉమాపతి లక్ష్మయ్య కండ్రిగలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న భార్య స్వాతిని తిరిగి ఇంటికి రమ్మని పిలిచాడు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరగడంతో ఆవేశంతో ఉమాపతి కత్తి తీసి వారి కుమార్తె ఎదుటే స్వాతి గొంతు కోశాడు.
బాలిక వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించగా, వారు స్వాతిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చిత్తూరు పశ్చిమ సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు.