బెంగళూరు: దక్షిణ బెంగళూరులోని జయనగర్‌లోని 5వ బ్లాక్‌లోని ఓ ఇంట్లో నగలు, నగదు, ఇతర విలువైన వస్తువులను అపహరించిన కేసులో మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఏప్రిల్ 24న వృద్ధ దంపతులు నివాసముంటున్న ఇంట్లోకి ప్రవేశించి రూ.2.5 లక్షల నగదు, బంగారు, వజ్రాభరణాలు, సీకో వాచ్‌తో పరారయ్యాడని శుక్రవారం విచారణ అధికారులు తెలిపారు.
మే 12న బాలుడిని పట్టుకున్న పోలీసులు రూ.8 లక్షల విలువైన 83 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.49,914 నగదు స్వాధీనం చేసుకున్నారు.మే 13న అతన్ని జువైనల్ జస్టిస్ బోర్డు (జేబీబీ) ముందు హాజరుపరిచారు. అతడి అరెస్ట్‌తో గిరినగర్, బనశంకరి స్టేషన్లలో ఉన్న మరో రెండు కేసులను పోలీసులు ఛేదించారు.