ముంబై: మంగళవారం తెల్లవారుజామున వసాయ్‌లో ప్రియుడు కొట్టి చంపిన 22 ఏళ్ల యువతి దారుణ హత్యతో మహారాష్ట్ర ఉలిక్కిపడింది. ఈ సంఘటనను పక్కన ఉన్నకెమెరాలు రికార్డ్ చేశాయి, కానీ ఎవరూ జోక్యం చేసుకుని దాడిని ఆపడానికి ప్రయత్నించలేదు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రోహిత్ యాదవ్ స్పానర్‌తో బాధితురాలు ఆర్తి యాదవ్‌ను వెంబడించి, ఆమె తలపై, ఛాతీపై పదే పదే కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత స్పానర్‌తో ఆమెను చితకబాది చంపేశాడు. అక్కడ ఉన్న వ్యక్తి రోహిత్ ని అడ్డుకోవడానికి ప్రయత్నిచాడు,అయితే, అతను అతన్ని దూరంగా నెట్టివేసి,స్పానర్‌తో కొడతానని బెదిరించాడు. ఆ వ్యక్తి వెనక్కి తగ్గిన తర్వాత అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. బాలిక కదలకుండా పడుకున్న తర్వాత, నిందితుడు "క్యూం కియా, క్యున్ కియా ఐసా మేరే సాత్?" అని అరుస్తున్నాడు.
“సంబంధాన్ని తెంచుకోవడం (హత్యకు) కారణంగా కనిపిస్తోంది. వారిద్దరూ పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఆ వ్యక్తి ఇండస్ట్రియల్ స్పానర్‌ని ఉపయోగించి బాలికను చాలాసార్లు కొట్టాడు. ఆమె శరీరంపై 18 గాయాలున్నాయి. హత్య జరుగుతున్నపుడు అక్కడ పెద్ద సంఖ్యలో జనం ఉన్నారని, అయితే ఎవరూ ఆమెను రక్షించలేదని ఫుటేజీలో కనిపిస్తుంది. అనేక కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. రోహిత్‌ను అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రూపాలీ చకంకర్ ఈ ఘటనను ‘మానవత్వానికి అవమానం’ అని అభివర్ణించారు. “అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నప్పుడు ఎవరూ సహాయం చేయడానికి రాకపోవడం చాలా ఆందోళనకరం” అని ఆమె అన్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. “వసాయ్‌లో యువతి హత్య చాలా తీవ్రమైనది మరియు దురదృష్టకరం. కఠిన చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ జరిపి, కోర్టులో బలమైన సాక్ష్యాలను సమర్పించి నిందితులకు అత్యంత కఠినంగా శిక్షించేలా చూడాలని పోలీసులను ఆదేశించారు.