అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ పై మరోసారి కాల్పులకు ప్రయత్నం జరిగాయి. అతి సమీపంలో ట్రంప్ కు కాల్పులు జరగడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అమెరికాలో వరస కాల్పులతో ఈ ఘటన మరోకొసారి కలకలం చెలరేగింది. ఇటీవలే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఆయన చెవి పై నుంచి బుల్లెట్ దూసుకుపోవడంతో ఆయన గాయపడిన విషయమూ తెలిసిందే.
అయితే ఈసారి ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లోని తన కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా, ట్రంప్ భద్రతా సిబ్బంది అతనిపై కాల్పులు జరిపారు, వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీసెస్ ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించింది. తుపాకీతో ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, మాజీ అధ్యక్షుడిపై హత్యకు యత్నించిన వ్యక్తిని ర్యాన్ వెస్లీ రౌత్ (58)గా గుర్తించినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ట్రంప్ కు ఏమీ గాయాలు కాలేదు. అతడు పారిపోయాడని, సంఘటన ప్రాంతంలో ఏకే 47 మోడల్ వంటి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు భద్రత సిబ్బంది వెల్లడించారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తోంది అని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.