యెమెన్ తీరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం. యెమెన్‌లోని తైజ్ ప్రావిన్స్ తీరంలో వలస పడవ బోల్తా పడింది. ప్రావిన్స్ తీరంలో వలసదారులతో వెళుతున్న పడవ ప్రమాదవశాత్తూ బోల్తాపడి మునిగిపోవడంతో 13 మంది దుర్మరణం చెందారు. మరో 14 మంది గల్లంతయ్యారు. తూర్పు ఆఫ్రికా నుండి వలస వచ్చినవారు ఈ దేశాలకు చేరుకోవడానికి ఈ మార్గాన్ని ఎక్కువగా అనుసరిస్తారు.
ఈ ప్రమాదంలో 13 మంది మృతదేహాలు లభ్యమైనట్లు ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ ఏజెన్సీ ఆదివారం తెలిపింది. గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ను ఎర్ర సముద్రానికి కలిపే బాబ్ అల్-మాండెబ్ జలసంధి ఒడ్డున 11 మంది మహిళలు, ఇద్దరి పిల్లల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యెమెన్ జాతీయులతో సహా మరో 14 మంది కనిపించలేదని, వలసదారులు జిబౌటి నుండి బయలుదేరినట్లు ఐఒఎం తెలిపింది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు అన్వేషణ కొనసాగిస్తోంది. ఓడ బోల్తా పడటానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.