News5am, Breaking News Telugu (04-06-2025): అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆశ్చర్యపరిచారు. వివిధ దేశాలతో చర్చలు జరుగుతున్న సమయంలోనే స్టీల్, అల్యూమినియంపై సుంకాలను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. వైట్‌హౌస్ ప్రకారం, ఈ కొత్త సుంకాలు బుధవారం నుంచే అమల్లోకి వస్తాయి. గతంలో కూడా ట్రంప్ ఇలాగే సుంకాలను పెంచగా, కొన్ని దేశాల వ్యతిరేకతలతో వెనక్కి తగ్గారు. కానీ ఈసారి ట్రంప్ పెన్సిల్వేనియాలో ఒక ప్లాంట్‌ను సందర్శించిన తర్వాత సుంకాలు పెంచబోతున్నట్లు చెప్పి, అదే ప్రకారం చర్యలు తీసుకున్నారు.
ఈ నిర్ణయం వల్ల అమెరికా వాణిజ్య యుద్ధాన్ని మరోసారి ప్రారంభించినట్లైంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ వంటి వాణిజ్య భాగస్వాములు ప్రతీకారం తీర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దూకుడుగా పాలన కొనసాగిస్తున్నారు. మిత్రదేశాలతో పాటు శత్రుదేశాలపై కూడా భారీ సుంకాలు విధిస్తున్నారు. దీని ప్రభావంతో స్టాక్ మార్కెట్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. చర్చలు కొనసాగుతుండగానే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల, ఇకపై ఆయా దేశాల ప్రతిస్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
More Breaking News Telugu Buzz:
News Telugu:
డొనాల్డ్ ట్రంప్కు షాక్ ఇచ్చిన అమెరికా కోర్టు..
నాలుగు దేశాల పర్యటనలో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్..
More Breaking News: External Sources
ట్రంప్ షాక్.. స్టీల్, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు పెంపు