News5am,Breaking Telugu New (08-05-2025): ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడిలో 100 మంది వరకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత చర్యని పలు దేశాలు సమర్థిస్తున్నాయి. తాజాగా, బ్రిటీష్ ఎంపీ ప్రీతి పటేల్ భారత్‌కి మద్దతు ప్రకటించారు. భారతదేశంతో కలిసి ఉగ్రవాద నిరోధక సహకారాన్ని బలోపేతం చేయాలని యూఎస్ హౌజ్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడారు. పాకిస్తాన్ నుంచి సరిహద్దు ఉగ్రవాద ముప్పుని గుర్తించాలని యూకేని కోరారు.

‘‘పహల్గామ్ ఉగ్రవాద దాడికి కారణమైన, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే సహేతుకమై చర్యలు తీసుకునే హక్కు భారత్‌కి ఉంది. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదులు భారత్ దేశం, పాశ్చాత్య ప్రయోజనాలను బెదిరిస్తారని మాకు తెలుసు’’ అని ఆమె అన్నారు. ఒసామా బిన్ లాడెన్ దాక్కున్న దేశం, భారత్‌పై సుదీర్ఘకాలం నుంచి ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తున్న చరిత్ర కలిగిన దేశం అని పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మిత్ర దేశాలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆమె యూకే పార్లమెంట్‌లో చెప్పింది.

More Breaking Telugu News

లాహోర్​ లో బాంబుల మోత..

Telugu Latest News Headlines : హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం నేడు..

More Breaking Telugu New: External Sources

MP Priti Patel: ‘‘పాకిస్తాన్‌‌పై దాడి చేసే హక్కు భారత్‌కి ఉంది’’.. బ్రిటీష్ ఎంపీ మద్దతు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *