News5am, Headlines Telugu (15-05-2025): ఇజ్రాయెల్ మరోసారి గాజా నగరంపై తీవ్రమైన దాడులు నిర్వహించింది. దక్షిణ గాజాలో గురువారం రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ సాయుధ దళాలు రాత్రిపూట 10 ఎయిర్‌స్ట్రైక్స్ జరిపాయి. ఈ దాడుల్లో వందలాది మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను నగరంలోని నాజర్ ఆసుపత్రికి తరలించగా, మృతుల శరీరాలను మార్చురీకి తరలించినట్టు సమాచారం.
ఇక మరోవైపు, బుధవారం ఉత్తర మరియు దక్షిణ గాజాపై జరిగిన వైమానిక దాడుల్లో 22 మంది చిన్నారులతో సహా మొత్తం 70 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం. ప్రస్తుతం ట్రంప్ గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన కాల్పుల విరమణ ఒప్పందం లేదా గాజాకు మానవతా సహాయాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
More Latest Telugu News:
Headlines Telugu:
బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం..
రోదసిలోకి దూసుకెళ్లనున్న రెండో భారతీయుడు…
More Latest Telugu News: External Sources
https://www.ap7am.com/tn/829402/israel-launches-fresh-airstrikes-on-gaza-killing-54