Charlie Kirk

Charlie Kirk: అమెరికాలో ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. కిర్క్ ద్వేషపూరిత ప్రసంగాలు నచ్చక 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ వారం రోజుల ముందే ప్రణాళిక వేసి హత్య చేశాడని దర్యాప్తులో తేలింది. యుటా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా రాబిన్సన్ కాల్పులు జరపగా, కిర్క్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన జరిగిన 33 గంటలకే పోలీసులు రాబిన్సన్‌ను అరెస్ట్ చేశారు. ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నిందితుడికి కఠిన శిక్ష పడుతుందని ప్రకటించారు.

పోలీసుల సమాచారం ప్రకారం, కిర్క్ ప్రసంగాల ద్వేషం తట్టుకోలేక రాబిన్సన్ ముందుగానే ఒక నోట్ రాశాడు. అలాగే తన భాగస్వామికి “ద్వేషం విసుగు తెప్పిస్తోంది” అంటూ సందేశాలు పంపాడు. కిర్క్ స్వలింగ సంపర్కం, ‘గే’ వివాహాలను బహిరంగంగా వ్యతిరేకించగా, రాబిన్సన్ మాత్రం గత సంవత్సరం నుంచి LGBTQ+ హక్కులకు మద్దతు ఇస్తున్నాడు. ఈ కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాబిన్సన్ దర్యాప్తులో సహకరించడం లేదు. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోలీసులకు లొంగిపోయాడు. నేరాలు రుజువైతే జీవితఖైదు లేదా కనీసం 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Internal Links:

మస్క్‌ను వెనక్కి నెట్టిన ల్యారీ ఎల్లిసన్‌..

ట్రంప్‌తో మాట్లాడేందుకు నేను రెడీ…

External Links:

చార్లీ కిర్క్ హత్య వెనుక అసలు కారణం ఇదే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *