అర్జెంటీనాలోని శాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో బొంబార్డియర్ ఛాలెంజర్ 300 విమానం భవనంపైకి దూసుకెళ్లడంతో పైలట్, కో-పైలట్ చనిపోయారు. పుంటా డెల్ ఎస్టే నుండి బయలుదేరిన విమానం శాన్ ఫెర్నాండో విమానాశ్రయంలోని రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా లోపల కారణంగా సమీపంలోని నివాస ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నివాస ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సమీపంలోని కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి.

విమానంలో ఉన్న ఇద్దరు పైలట్ అగస్టిన్ ఆర్ఫోర్టే (35), కో-పైలట్ మార్టిన్ ఫెర్నాండెజ్ లోజా (44) లు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద స్థలంలో అత్యవసర సేవల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో అక్కడి పరిస్థితిని అఫుపు చేసేందుకు స్థానిక రహదారులను మూసివేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *