Earthquake in Queensland: క్వీన్స్‌ల్యాండ్‌లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.4గా నమోదు కాగా, భూకంపం 10 కి.మీ లోతులో ఏర్పడినట్లు యూరోపియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. దీంతో సమీపంలోని పట్టణాలు, నగరాల్లో ప్రభావం కనిపించింది. అయితే ఇప్పటివరకు ఆస్తి, ప్రాణ నష్టంపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. భూకంపం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
క్వీన్స్‌ల్యాండ్ తూర్పు తీరప్రాంతంలో ఈ భూకంపం సంభవించగా, కొన్ని ఆస్తులు కూలిపోయినట్లు సమాచారం. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలోనే క్వీన్స్‌ల్యాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ప్రాంతాన్ని అధిక ప్రమాదకర భూకంప మండలంగా గుర్తించారు. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడానికి జియోసైన్స్ ఆస్ట్రేలియా నేషనల్ భూకంప హెచ్చరిక కేంద్రం పరిశీలన జరుపుతోంది.
Internal Links:
ట్రంప్‌పై అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ విమర్శలు..
భారత్ కు ఒక్క నీటి చుక్కని కూడా ఇవ్వమన్న పాక్ ప్రధాని
External Links:
క్వీన్స్‌ల్యాండ్‌లో భారీ భూకంపం