H1b And Other Premium Processing

H1b And Other Premium Processing: అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ టెక్ ఉద్యోగులకు యూఎస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హెచ్-1బీ సహా పలు ఇమ్మిగ్రేషన్ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను పెంచుతూ అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS) నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో ఈ ఫీజులను సవరించినట్లు వెల్లడించింది. కొత్త రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సాధారణంగా వీసా దరఖాస్తుల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతుండగా, త్వరిత సేవ కోసం ప్రీమియం ప్రాసెసింగ్‌ను చాలామంది ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఆ సేవ మరింత ఖరీదైనదిగా మారనుంది.

మార్చి నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఫీజుల ప్రకారం హెచ్-1బీ, ఎల్-1 వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెరిగింది. అలాగే గ్రీన్ కార్డ్‌కు సంబంధించిన ఎంప్లాయిమెంట్ బేస్డ్ పిటిషన్ (I-140) ఫీజు కూడా అదే స్థాయిలో పెరిగింది. విద్యార్థుల కోసం OPT, STEM-OPT ప్రాసెసింగ్ ఫీజు 1,685 డాలర్ల నుంచి 1,780 డాలర్లకు, స్టేటస్ మార్పు కోరే విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్ల ఫీజు 1,965 డాలర్ల నుంచి 2,075 డాలర్లకు పెరిగింది. ఈ పెంపు వల్ల అమెరికా వెళ్లాలని భావిస్తున్నవారిపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

వీసా దరఖాస్తుదారులకు అమెరికా బిగ్ షాక్.. భారీగా పెరిగిన ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు, మార్చి 1 నుంచే అమలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *