India-Nepal border: హిమాలయ దేశం నేపాల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళనలు రోజురోజుకి తీవ్రతరమవుతున్నాయి. సోషల్ మీడియాలో పెట్టిన బ్యాన్‌ను ఎత్తివేసినా నిరసనలు ఆగలేదు. ఈ పరిణామాల మధ్య రాజకీయ సంక్షోభం ఏర్పడి, ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దీంతో దేశంలో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. భారత్-నేపాల్ సరిహద్దులో పోలీసులు అప్రమత్తమై హైఅలర్ట్ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లోని పానిటాంకి వద్ద పోలీస్ పోస్టు ఏర్పాటు చేసి అదనపు బలగాలను మోహరించారు. అధికారులు సరిహద్దు పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
ఇక, ఈ ఆందోళనల దృష్ట్యా భారత్ కీలక చర్యలు తీసుకుంది. నేపాల్‌లో ఉన్న భారతీయుల కోసం ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. అక్కడి పరిస్థితులు కఠినంగా ఉన్నందున జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారుల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. కాఠ్మాండు సహా అనేక నగరాల్లో కర్ఫ్యూ విధించబడింది. యువకుల మరణాలు విచారకరమని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
Internal Links:
మరోసారి అమెరికా వెళ్లనున్న యూరోపియన్ నేతలు…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ వ్యాఖ్య..
External Links:
భారత్-నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్