Israeli Strike On Gaza Hospital: గాజాను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ దాడులను మరింత ఉధృతం చేసింది. సోమవారం గాజా నాసర్ ఆస్పత్రిపై భారీ వైమానిక దాడి జరిపింది. ఇందులో ముగ్గురు జర్నలిస్టులు సహా 15 మంది మరణించారు. మరణించిన వారిలో అల్ జజీరా, రాయిటర్స్‌కు చెందిన జర్నలిస్టులు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఆస్పత్రి నాల్గవ అంతస్తుపై దాడి జరగగా, రెస్క్యూ సిబ్బంది చేరేలోపే రెండో క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. తాము హమాస్ ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆస్పత్రి నుంచి భారీగా పొగలు ఎగసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక గాజాను స్వాధీనం చేసుకోవడంపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫ్రాన్స్, బ్రిటన్ సహా పలు దేశాలు ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశాయి. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని ప్రకటించాయి. ఐక్యరాజ్యసమితి కూడా ఇజ్రాయెల్ చర్యలను తప్పుబట్టి, వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని కోరింది. అయినప్పటికీ ఇజ్రాయెల్ దూకుడుగా ముందుకు సాగుతోంది.
Internal Links:
టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం..
శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్ట్..
External Links:
గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు.. జర్నలిస్టులు సహా 15 మంది మృతి