దాదాపుగా 5 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ఇరుదేశాధినేతలు కజాన్ నగరంలో ద్వైపాక్షికలో భేటీ జరిగింది. 2019 తర్వాత వీరిద్దరూ అధికారిక ద్వైపాక్షిక భేటీ కావడం ఇదే మొట్టమొదటిసారి. ఈ సందర్భంగా ప్రధాన మోదీ, అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..జిన్‌పింగ్‌ను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఐదేళ్ల తర్వాత తమ మధ్య సమావేశం జరిగిందని ప్రస్తావించారు. ఐదేళ్ల తర్వాత తమ మధ్య ఈ భేటీ జరిగిందని తెలిపారు. భారత్-చైనా సంబంధాల ఆవశ్యకత ఇరు దేశాల పౌరులకు మాత్రమే ప్రయోజనకరం కాదని, ప్రపంచ శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి కీలకమని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల సమస్యలు అన్నింటిపై మాట్లాడే అవకాశం తమకు ఇవాళ లభించిందని ఈ చర్చలు నిర్వహిస్తామని అన్నారు. సానుకూలంగా, నిర్మాణాత్మకంగా ఈ చర్చలు ముందుకు సాగుతాయని విశ్వసిస్తున్నట్టు మోదీ వెల్లడించారు.