భారత ప్రధాని మోడీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా వాణిజ్య సుంకాలపై చర్చలు జరిగాయి. అయితే శుక్రవారం ఇదే అంశంపై ట్రంప్‌ను విలేకర్లు ప్రశ్నించగా, అమెరికా-భారత్ మధ్య వాణిజ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని తెలిపారు. ఇక ఈ సందర్భంగా ప్రధాని మోడీని ట్రంప్ ప్రశంసించారు. మోడీ తెలివైన వ్యక్తి అంటూ కితాబు ఇచ్చారు. మోడీ మంచి స్నేహితుడని పేర్కొన్నారు.
‘‘ప్రధాని మోడీ ఇటీవలే అమెరికాకు వచ్చారు. మేము ఎల్లప్పుడూ చాలా మంచి స్నేహితులం. ఆయన (మోడీ) చాలా తెలివైన వ్యక్తి. నాకు చాలా మంచి స్నేహితుడు. మేము చాలా చర్చలు జరిపాము. తాము భారతదేశం కోసం చాలా బాగా పని చేస్తారు అని నేను భావిస్తున్నాను”. అని ట్రంప్ తెలిపారు.