Putin Trump Meeting: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా నేత డొనాల్డ్ ట్రంప్ మధ్య వచ్చే వారంలోనే శిఖరాగ్ర సమావేశం జరగే అవకాశాలు ఉన్నాయని పుతిన్ వెల్లడించడంతో అంతర్జాతీయ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీకి యూఏఈ వేదికగా నిలిచే అవకాశముందని, దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు వేగంగా సాగుతున్నాయని రష్యా అధ్యక్షుడి సహాయకుడు యూరీ ఉషకోవ్ ధ్రువీకరించారు. అమెరికా వైపు నుంచే ముందుగా చొరవ చూపగా, ఇటీవల ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ మాస్కోలో పుతిన్‌తో జరిపిన సమావేశం తర్వాత ఈ పరిణామాలు మరింత వేగం అందుకున్నాయి. ఈ సమావేశం నిర్వహణకు యూఏఈ సహా అనేక మిత్ర దేశాలు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని పుతిన్ తెలిపారు. ట్రంప్, పుతిన్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో త్రైపాక్షిక సమావేశం యోచిస్తున్నప్పటికీ, దానికి అవసరమైన పరిస్థితులు ఇంకా లేవని పుతిన్ స్పష్టం చేశారు.
ఈ భేటీ ద్వారా రష్యా-అమెరికా సంబంధాలు మళ్లీ గాడిలో పడతాయని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ దిమిత్రియేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్కిటిక్ ప్రాజెక్టులు, అరుదైన భూ లోహాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల్లో అమెరికా పెట్టుబడిదారులతో కలిసి పనిచేసే విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశం జరిగితే, ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలకు కొత్త ఊపు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Internal Links:
డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ ఫైర్..
External Links:
అగ్రరాజ్యాల మధ్య కీలక పరిణామం.. త్వరలో పుతిన్, ట్రంప్ భేటీ