Tsunami Hits Russian Coast

Tsunami Hits Russian Coast: రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పాన్ని 8.8 తీవ్రతతో భూకంపం కలిచివేసింది. ఫార్ ఈస్టర్న్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున సంభవించిన ఈ శక్తివంతమైన భూకంపం ధాటికి భవనాలు ఒక్కసారిగా కంపించాయి. భూకంపం అనంతరం అధికారులు వెంటనే అప్రమత్తమై సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అలలు 4 మీటర్ల (13 అడుగులు) ఎత్తుకు చేరే అవకాశం ఉందని హెచ్చరించారు. సమీప ప్రాంతాల ప్రజలకు ఖాళీ చేయమని సూచించారు. ప్రాణనష్టం వివరాలు ఇంకా వెల్లడి కాలేదు కానీ భవనాలు భారీగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. షాకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకారం, రష్యాతో పాటు హవాయి, ఈక్వెడార్ వంటి ప్రాంతాల్లోనూ 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొంది. భూకంపం భూమి లోపల 19.3 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. కమ్చట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్‌కు తూర్పు-ఆగ్నేయంగా 125 కిలోమీటర్ల దూరంలోని అవాచా బే తీరం వద్ద కేంద్రీకృతమై ఉందని అమెరికా నివేదిక వెల్లడించింది. సునామీ హెచ్చరికలు రష్యాతో పాటు అమెరికా, జపాన్, అలాస్కా వంటి అనేక ప్రాంతాలకు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు.

Internal Links:

అప్పుడు భారత్-పాకిస్తాన్, ఇప్పుడు థాయిలాండ్-కంబోడియా..

రష్యా విమానం కూలిపోయింది..

External Links:

వెలుగులోకి షాకింగ్ వీడియోలు.. హడలెత్తిపోయిన ప్రజలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *