ఈ ప్రమాదంలో కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫైళ్లు దగ్ధమైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ ఈ-సేవా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.