తెలంగాణలో డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న వారికి శుభవార్త. నేడు 10,006 మంది కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగులు ఇవ్వనున్నారు. కొత్త టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ ఎస్జీటీకి ఒక హాల్, స్కూల్ అసిస్టెంట్, ఇతర పోస్టులకు కలిపి మరో హాల్ ఏర్పాటు చేసి మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
అనంతరం వెంటనే విధుల్లో చేరే లా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. పోస్టింగ్ వచ్చిన పాఠశాలల్లో ఈ నెల 16వ తేదీన కొత్త టీచర్లు చేరాల్సి ఉంటుంది. పోస్టింగ్‌ల కేటాయింపు నేడు పూర్తి కానుంది. ఒకవేళ ఏమైనా మిగిలితే బుధవారం కూడా పోస్టింగ్‌ల కేటాయింపు జరుగుతుందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.