విజయవాడ: 25 మంది ప్రయాణికులతో రాయపూడి గ్రామం నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తున్న లాంచీ బోటు బుధవారం నాడు ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణానదిలో ఇసుక దిబ్బను ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం సిఐ ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో పశ్చిమ ఎసిపి మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక మత్స్యకారుల నాటు పడవలతో చిక్కుకుపోయిన ప్రయాణికులను రక్షించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.