హైదరాబాద్: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సిబ్బంది రైళ్లలో సాధారణ తనిఖీల్లో 570 కిలోల ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. పట్టుబడిన పీడీఎస్ బియ్యం విలువ రూ.7వేలు ఉంటుందని అంచనా. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు.
