కృష్ణానదికి మరోసారి వరద ఉధృతి పెరగడంతో, ఇప్పటికే జూరాలలో గేట్లు ఎత్తేయడంతో, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయం గేటును అధికారులు ఎత్తివేశారు. రేడియల్ క్రెస్ట్ గేట్ ఎత్తివేయడం ఈ ఏడాది ఇది ఐదోసారి. వాటర్ షెడ్ 1 రేడియల్ క్రెస్ట్ గేట్ ను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు, 93,270 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో రూపంలో వచ్చి శ్రీశైలం డ్యామ్ కు చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 212.9198 టీఎంసీల నీరు నిల్వ ఉంది. విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఇంక, జూరాలకు వరద ఉదృతి కొనసాగుతోంది. దీంతో 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో 69,000 క్యూ సెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 78,503 క్యూ సెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1044.849 ఫీట్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు అయితే, ప్రస్తుత నీటి నిల్వ 9.562 టీఎంసీలుగా ఉంది. ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రలలో 11 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.