సాధారణంగా సీసీటీవీ కెమెరాలను ఇళ్లలోనూ, ఆఫీస్‌ల్లోనూ, రోడ్ల మీద, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనూ అమర్చుతారు. సెక్యూరీటీ కారణాల రీత్యా సీసీటీవీ కెమేరాలన అమర్చుతారు. అయితే పాకిస్తాన్ లోని ఓ వ్యక్తి మాత్రం వెరైటీగా ఆలోచించాడు. తన కూతురి తలపైనే సీసీటీవీ కెమెరాను అమర్చాడు. ఆమె ఎక్కడికెళుతుందో, ఏం చేస్తుందో అనుక్షణం తెలుసకుంటున్నాడు. కరాచీకి చెందిన ఆ యువతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తలపై సీసీటీవీ కెమెరా ఎందుకు ఉందో వివరించింది. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడ్తుంది.
తన తలపై సీసీటీవీని తన తండ్రి ఏర్పాటు చేశారని తెలిపింది. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నానో ప్రతి విషయం తెలుసుకోవాలని మా నాన్న అనుకున్నారు. అని ఆమె చెప్పింది. అందుకు మీరు అభ్యంతరం చెప్పలేదా అని అడిగితే. ఆమె లేదు అని చెప్పింది. నా రక్షణ కోసమే మా నాన్న ఈ ఏర్పాటు చేసారని, తన తండ్రి తన కోసం ఏ నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని చెప్పింది. సీసీటీవీ కెమెరా ద్వారా తన తండ్రి తనకు 24 గంటలపాటు సెక్యురిటీ కూడా ఇస్తున్నారని చెబుతోంది. ప్రస్తుతం కరాచీలో పరిస్థితులు చూస్తున్నాం కదా అంటూ ఆ యువతి ఆ వీడియోలో పేర్కొంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు నవ్వుకుంటున్నారు.