సినిమాల్లో తన నటన శైలితో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు ఫిష్ వెంకట్. ఆయన ఎక్కువగా హాస్య ప్రధాన, సహాయ పాత్రలు చేసి ఆకట్టుకున్నారు, ప్రస్తుతం ఫిష్ వెంకట్ అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ,ఇంటికే పరిమితం అయ్యాడు. ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం సహకరించక, ఆర్ధిక సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. డయాబెటిక్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురికావడంతో పాటు వెంకట్ రెండు కిడ్నీలూ ఫెయిల్ అయ్యాయి. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఫిష్ వెంకట్‌ను ఇంటర్వ్యూ చేశారు.
ఈ ఇంటర్వ్యూలో ఆయన తన కష్టాలను వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా ఆయన దీన స్థితిని వెలుగులోకి వచ్చింది. దాంతో ఆయనకు సాయం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఫిష్ వెంకట్ కాలుకు వైద్యం చేశారు డాక్టర్స్. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు అని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, కష్టం తెలిసిన వ్యక్తిగా తన కాళ్ళ ముందు ఎవరు కష్టాలలో ఉన్నాకూడా వారికి వెంటనే సహాయపడతారు. ఇటీవలే తెలుగు రాష్ట్రాల వరదబాధితులకు రూ. 1 కోటి రూపాయిలు సాయం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఫిష్ వెంకటేష్ దీన స్థితి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అపోలో హాస్పటల్స్‌లో ఫిష్ వెంకట్‌కు ఉచితంగా వైద్యం చేయించేలా డాక్టర్స్‌తో మాట్లాడారట చిరు. చిరంజీవి ఎప్పటికప్పుడు వెంకట్ ఆరోగ్య పరిస్థితిని అపోలో వైద్యులను అడిగి తెలుసుకున్నారు.