స్కూల్ విద్యార్థులకు మంత్రి సీతక్క తీపి కబురు చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్దులకు మరో జత యూనిఫాంలు సిద్దం చేసి పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై మంత్రి సీతక్క సమీక్షించారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ స్వచ్చదనం, పచ్చదనం విజయవంతం చేసిన అందరికి అభినందనలు తెలిపారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి పారిశుద్య కార్మీకుల వరకు బాగా కష్టపడ్డారని అన్నారు .
మంచి పనితీరు కనబరిచిన సిబ్బందిని ఆగస్టు 15న సన్మానిస్తామని తెలిపారు. గతంతో పోలిస్తే ఎక్కువ పని జరిగిందని, కాని మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇక నుంచి ప్రతి నెలా మూడు రోజుల పాటు స్వచ్చదనం – పచ్చదనం డ్రైవ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. పాములతో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్ని అన్నారు. క్లీనింగ్ మీద దృష్టి సారించండి, పారిశుద్య లోపాలపై వార్తలు వస్తే సరిదిద్దండని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల వరకు అధికారులు ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని, ఉదయం కనీసం మూడు గంటల పాటు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని జీపీ స్పెషల్ అధికారులను మంత్రి ఆదేశించారు. సీతక్క మహిళా సంఘాల సభ్యత్వాన్ని కోటి మందికి చేర్చాలని పిలుపునిచ్చారు.