ఏపీలో ఐసెట్ 2024 కౌన్సెలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 1 వరకు ఉండవచ్చు. జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, ఆగస్టు 4 నుంచి 7 వరకు ఆప్షన్ల ఎంపిక, ఆప్షన్ల మార్పు ఆగస్టు 8న అనుమతించబడుతుంది. మొదటి దశ సీట్ల కేటాయింపు జూలై 10న జరగనుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.600 చెల్లించాలి. కౌన్సెలింగ్ ఫీజు ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి.