ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపే విడుదల చేయనున్నట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తామని వారు తెలిపారు.
ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in లో ఫలితాలను తనిఖీ చేయవచ్చని, అలాగే మన మిత్ర నంబర్ 9552300009 కు “హాయ్” అని సందేశం పంపడం ద్వారా కూడా ఫలితాలను తనిఖీ చేయవచ్చని మంత్రి అన్నారు. ఈ సంవత్సరం ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిసింది. వీరంతా ఎప్పుడెప్పుడాని ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.