ఏపీలోని రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీల్లోని క్యాంపస్ కాలేజీలు, అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీని నిర్ణయించారు. విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి ఆగస్టు 7 నుండి 12 వరకు ఆన్‌లైన్ ఎంపికలను నమోదు చేసుకోవచ్చు.
ఏపీ పీజీ సెట్ 2024 ద్వారా ఆంధ్రా యూనివర్శిటీ, ఎస్వీ యూనివర్శిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, యోగి వేమన యూనివర్శిటీ, రాయలసీమ యూనివర్శిటీ, విక్రమ సింహపురి యూనివర్శిటీ, ద్రవిడ యూనివర్శిటీ, కృష్ణా యూనివర్శిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్శిటీ,కర్నూలు క్లస్టర్ యూనివర్శిటీ, ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్శిటీ, స్విమ్స్ తిరుపతి,జేఎన్ టియూ అనంతపురంలలో అందించే వివిధ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ Online Exam ద్వారా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారు. ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. విద్యార్ధులకు ర్యాంక్ కార్డులు కూడా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఏ కాలేజీలో చేరాలనే దానిపై నేటి నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.