రేపు జరగనున్న గ్రూప్-2 మెయిన్స్ ప‌రీక్ష‌ల నిర్వహణపై ఏపీపీఎస్‌సీ క్లారిటీ ఇచ్చింది. రేపు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, పరీక్షల వాయిదాపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని బోర్డు తెలిపింది.

పేపర్-1 ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. అభ్యర్థులు 15 నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *