కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తన కుమార్తెను అంగన్ వాడీలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కలెక్టరేట్ సముదాయంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన నిన్న ఉదయం సందర్శించారు. దీంతో ఆయన కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారని అందరూ భావించారు.
అయితే అందులో తన నాలుగేళ్ల కూతురు స్వర్ణను చేర్చేందుకు వచ్చానని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే కాకుండా ఆటలు కూడా నేర్పిస్తున్నారని, అందుకే తన కుమార్తెను ఇందులో చేర్చామని కలెక్టర్ తెలిపారు.