చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు కె. వీర రాఘవ రెడ్డికి బెయిల్ మంజూరైంది. రాజేంద్రనగర్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. రూ. 15 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
దాదాపు రెండు నెలల క్రితం రంగరాజన్ పై జరిగిన దాడిలో రామరాజ్యం వ్యవస్థాపకుడు వీర రాఘవ రెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రంగరాజన్ తన సంస్థకు ఆర్థిక సహాయం అందించాలని, రామరాజ్యానికి సభ్యులను నియమించాలని వీర రాఘవ రెడ్డి డిమాండ్ చేయగా, రంగరాజన్ నిరాకరించడంతో అతనిపై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.