News5am, Breaking News Telugu (13-06-2025): కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో భారత్‌లోని 49 జిల్లాల్లో ఎక్కువగా మరణాలు నమోదయ్యాయని ఐక్యరాజ్యసమితి (యూఎన్) పాపులేషన్ రిపోర్ట్ పేర్కొంది. అందులో తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ఉంది. 2021లో సిరిసిల్ల జిల్లాలో జననాల కంటే మరణాలు అధికంగా నమోదయ్యాయి. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) డేటా ప్రకారం, ఆ జిల్లాలో 5,028 మంది పుట్టగా, 5,130 మంది చనిపోయారు. ఈ మరణాల్లో ఎక్కువశాతం కరోనా వల్ల జరిగినట్లు యూఎన్ అంచనా వేసింది. మొత్తం రాష్ట్రంలో ఆ ఏడాది 2,34,425 మంది చనిపోగా, అందులో 1,35,725 మంది పురుషులు, 98,700 మంది మహిళలు ఉన్నారు. పురుషుల మరణాల రేటు సుమారుగా 40% ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రికార్డైన మరణాల్లో 75% వరకు 21 రోజుల్లోనే నమోదు కాగా, కొన్ని మరణాలు ఆలస్యంగా నమోదయ్యాయి.
యూఎన్ రిపోర్ట్ ప్రకారం, తెలంగాణలో 65–69 ఏళ్ల మధ్య వయసువారు 85,945 మంది, 70 ఏళ్లు పైబడిన వారు 51,516 మంది చనిపోయారు. వృద్ధుల్లో మరణాలు సహజమేనని పేర్కొన్నా, మధ్య వయస్సువారిలోనూ మరణాల రేటు పెరగడం గమనార్హం. 2021లో 55–64 ఏళ్ల వయసువారు 42,349 మంది, 45–54 ఏళ్లవారు 22,423 మంది, 35–44 ఏళ్లవారు 12,184 మంది చనిపోయారు. ఇది తీవ్రమైన ఆరోగ్య సంక్షోభానికి సూచనగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యమైన కారణాలు: ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, జీవనశైలి లోపాలు, హైపర్‌టెన్షన్, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు అని వారు తెలియజేశారు.
More Breaking News:
Breaking News Telugu:
జూన్ 12 నుంచి స్టూడెంట్ బస్పాస్ల జారీ..